17 జూన్, 2020

పవన్ తో పాటు మరో స్టార్ హీరో కూడా నో చెప్పాడు

ఈ జెనెరేషన్లో ఒకరకంగా మల్టిస్టార్ చిత్రాలకి బీజం వేసింది "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు". ఈ చిత్రాన్ని 2013 లో శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయగా దిల్ రాజు ప్రొడ్యూస్ చేసాడు. శ్రీకాంత్ అడ్దాల ఈ చిత్ర స్క్రిప్ట్ కోసం మూడు సంవత్సరాల సమయం తీసుకున్నారు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ హీరోలుగా నటించగా అంజలి, సమంత హీరోఇన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్ ఎప్పటిలాగే తండ్రి పాత్రలో అద్బుతంగా ఒదిగిపోయారు. రావు రమేష్ కరీయర్లో ఈ చిత్రం ఒక మైలురయిగా నిలిచిపొయింది, అంత అద్భుతంగా నటించారు.

కుటుంబ కథా ప్రేమికులని చాలా బాగా అలరించింది ఈ చిత్రం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వెంకటేష్, మహేష్ బాబుల మధ్య చిన్నోడు.. పెద్దోడు.. అంటూ వచ్చిన సన్నివేశాలు అందరిని అలరించాయి. ఇందులోని పాటలు ఈ చిత్ర విజయానికి దోహదపడ్డాయి. ఈ సినిమాని 50కోట్ల బుడ్జెట్ తో తీయగా 55కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బుల్లితెర పైన కూడా అద్భుతంగా ఆదరించారు. ఇప్పటికీ బుల్లితెర మీద ప్రసారం అయిన ప్రతిసారి మంచి టి.ఆర్.పి ని సొంతం చెసుకుంటోంది అంటే ఈ చిత్రం ఎంతగా ప్రజల మన్ననల్ని గెలుచుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

నిజానికి ఈ సినిమాని ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేసారంట. పవర్ స్టార్ పవన్ కళ్యాన్.. జనసేనానిని చిన్నోడు పాత్ర కోసం సంప్రదించగా వివిధ కారణాల వల్ల చేయలేకపోయారు. అలా ఈ పాత్ర మహేష్ బాబు దగ్గరికి వెల్లింది.

అలాగే పెద్దోడు పాత్ర కోసం ముందుగా నాగార్జునను అడగటం జరిగింది. కానీ ఎందుకో నాగార్జునకి ఈ పాత్ర పెద్దగా నచ్చలేదు అంట. దీనితో ఈ పాత్ర వెంకటేష్ దగ్గరికి వెల్లింది. కాగా, ఈ పాత్రలో వెంకటేష్ అద్భుతంగా నటించారు.

ఏది ఏమైనా ఈ చిత్రం మహేష్ బాబు, వెంకటేష్ లకు మధురానుభూతులను మిగిల్చింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

పవన్ తో పాటు మరో స్టార్ హీరో కూడా నో చెప్పాడు

ఈ జెనెరేషన్లో ఒకరకంగా మల్టిస్టార్ చిత్రాలకి బీజం వేసింది "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు". ఈ చిత్రాన్ని 2013 లో శ్రీకాంత్ అడ్డాల...